ఆప‌రేష‌న్ మిలాన్ : విశాఖ వేడుకల్లో జ‌గ‌న్  

-

తొలిసారి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం, భార‌త నావికా ద‌ళం సంయుక్తంగా మిలాప్ 2022 పేరిట నిర్వ‌హించిన ఉత్స‌వాలు అనేక ప్ర‌త్యేక‌త‌లకు ఆన‌వాలుగా నిలిచింది. ముఖ్యంగా మ‌న జ‌లంత‌ర్గామి (విశాఖ ఐఎన్ఎస్) ను జాతికి అంకితం చేసిన సీఎం, అనంత‌రం నేవీ సిబ్బందితో మాట్లాడి వారి  యోగ క్షేమాల‌తో పాటు దేశ ర‌క్ష‌ణ‌లో భాగం అవుతున్న తీరు గురించి కూడా తెలుసుకున్నారు. గ‌గ‌న త‌ల విన్యాసాలు,స‌ముద్ర జలాల్లో నావికా ద‌ళం  చేసిన విన్యాసాలు ఆద్యంతం పండుగ వాతావర‌ణాన్ని  త‌ల‌పించాయి.

ఆర్థిక రాజ‌ధాని విశాఖకు జ‌గ‌న్ నిన్న‌టి వేళ చేరుకుని ఇక్క‌డి నేవీ ఉత్స‌వాల్లో పాల్గొన్నారు.అదేవిధంగా ఇక్క‌డివారి ప‌నితీరు గురించి తెల్సుకుని అంద‌రినీ పేరు పేరునా అభినందించారు.మొట్ట‌మొద‌టిసారిగా మిలాన్ – 2022 పేరిట నిర్వ‌హించిన ఉత్స‌వాల‌కు ముఖ్య అతిథిగా విచ్చేసి అంద‌రిలోనూ కొత్త ఉత్సాహం నింపారు.ముఖ్యంగా నీటి ఉప‌రిత‌లంపై దూసుకుపోయే యుద్ధ నౌక‌ల ప‌నితీరు, వాటి నిర్మాణం వీట‌న్నింటినీ వివ‌రించి సీఎంకు అతిథి స‌త్కారం అందించారు నేవీ అధికారులు.ఆయ‌నకు త‌మ త‌ర‌ఫున  గౌర‌వ వంద‌నం అందించి, విశాఖ కేంద్రంగా భార‌త నౌకా ద‌ళం మిత్ర దేశాల సాయంతో ఏ విధంగా ప‌నిచేస్తున్న‌దీ వివ‌రించి, అటుపై వివిధ విభాగాల ప‌నితీరు ను కూడా విశదీక‌రించారు.పూర్తి స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో రూపొందిన విశాఖ ఐఎన్ఎస్ (యుద్ధ నౌక) ప‌నితీరు గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నారు.

విశాఖ‌తీరాన నిన్న‌టివేళ నావికా ద‌ళ విన్యాసాలు అబ్బుర ప‌రిచాయి. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తన జీవ‌న స‌హ‌చ‌రి భార‌తీ తోస‌హా వచ్చి వీటిని వీక్షించి వెళ్లారు.ఆప‌రేష‌న్ మిలాన్ పేరిట చేప‌ట్టిన విన్యాసాలు చూప‌రుల‌ను సైతం క‌ట్టిపడేశాయి. ఇదే సంద‌ర్భంలో ఐఎన్ఎస్ విశాఖ (యుద్ధ నౌక‌) ను జాతికి అంకితం చేశారు జ‌గ‌న్. యుద్ధ విన్యాసాలు అనంత‌రం స్నేహ పూర్వ‌క దేశాలు అయిన ఆస్ట్రేలియా,అమెరికా, శ్రీ‌లంక‌,బంగ్లాదేశ్,వియ‌త్నాంతో పాటు ఇంకొన్ని దేశాల మార్చ్ ఫాస్ట్ ఆక‌ట్టుకుంది. అదేవిధంగా ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన లేజ‌ర్ షో మంత్ర‌ముగ్ధుల‌ను చేసింది.ఇక విశాఖ ఐఎన్ఎస్ ను జాతికి అంకితం చేశాక జ‌గ‌న్ సంబంధిత నావికాద‌ళ సిబ్బంది తో మాట్లాడారు. ఇక్క‌డ ఉన్న నావికా సంప‌త్తి గురించి వివ‌రాల‌ను సంబంధిత అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు.ఈ సంద‌ర్భంగా నేవీ అధికారుల ప‌నితీరును ప్ర‌శంసించారు జ‌గ‌న్ ఆయ‌న‌తో పాటు ఉన్న భార‌తి కూడా!

Read more RELATED
Recommended to you

Exit mobile version