స్ఫూర్తి: మిరియాల పంటతో రూ.17 లక్షల ఆదాయం.. ఈ రైతుని ఆదర్శంగా తీసుకోండి మరి..!

-

చాలామంది రైతులు కష్టాలు పడుతూ ఉంటారు పంట చేజారిపోవడం లేదంటే పంట నాశనం అయిపోవడం లేకపోతే పండిన పంటకి లాభాలు సరిగ్గా రాకపోవడం… ఇలా ఏదో ఒక సమస్యని రైతులు ఎదుర్కొంటూ ఉండొచ్చు. ఈ మధ్య కాలంలో చాలామంది వ్యవసాయం చేయడం తగ్గించేశారు. కానీ నిజానికి ఈయనని ఆదర్శంగా తీసుకుంటే కచ్చితంగా మీరు కూడా లక్షల్లో లాభాలని పొందగలరు.

మరి ఇక ఈ రైతు సక్సెస్ స్టోరీ ని ఇప్పుడే చూద్దాం. ఈ రైతు మిరియాల సాగు ద్వారా 17 లక్షల రూపాయలని పొందాడు. మిరియాల కి మనదేశంలో చాలా డిమాండ్ ఉంది. మేఘాలయ కి కి చెందిన నానోద్రో బి మారక్ అనే ఒక రైతు మిరియాల సాగు ద్వారా భారీ ఆదాయాన్ని పొందాడు. తన ఐదెకరాల భూమిలో మిరియాలను సాగు చేస్తున్నాడు ఆయన విజయాన్ని చూసి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని కూడా ఇచ్చి సత్కరించింది ఇక మరి ఈ రైతు సక్సెస్ స్టోరీ గురించి చూసేద్దాం.

ఈ రైతు కరి ముండా రకానికి చెందిన మిరియాలను పండిస్తున్నారు. రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులను వాడాడు. కేవలం సేంద్రీయ ఎరువులను వాడాడు. 10వేలు ఖర్చుచేసి సుమారు 10 వేల మిరియాల మొక్కలను నాటారు. క్రమంగా పంటని విస్తరించి అధిక లాభాలని పొందుతున్నాడు. వెస్ట్ గారో హిల్స్ కొండలలో ఇతను ఉంటాడు. ఇక్కడ నల్ల మిరియాలు వంటి సుగంద ద్రవ్యాల సువాసన వస్తుంది. మిరియాల సాగుకు రాష్ట్రవ్యవసాయ, ఉద్యానవనశాఖ పూర్తి సహకారం ఇచ్చింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version