ముందస్తు ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తనకి అసెంబ్లీకి పోటీ చేయాలని ఉందన్నారు. ఇక నిజామాబాద్ పార్లమెంటు స్థానంపై అధిష్టానానిదే తుది నిర్ణయం అన్నారు. నిజామాబాద్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ బలంగా ఉందన్నారు జీవన్ రెడ్డి.
ఇక రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇస్తే తాను రాజకీయాలనుంచి తప్పుకుంటానని బిఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. టిఆర్ఎస్ నాయకులు ముందుగా కంటి వెలుగు ఆపరేషన్లు చేయించుకోవాలని చురకలంటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏసిడి పేరుతో చార్జీలు వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఔరంగజేబు పాలనలో జుట్టు పన్ను ఉంటే.. ఇప్పుడు కెసిఆర్ పాలనలో ఏసీడీ చార్జీలు ఉన్నాయని విమర్శించారు. ఏసిడి చార్జీలు చట్ట విరుద్ధమని మండిపడ్డారు.