ఇన్ స్టా కా బాప్ : బుట్ట బొమ్మా క‌నిపించ‌వ‌మ్మా..!

-

ఎక్కడున్న‌వమ్మా అని అడ‌గి చూడండి పూజా బేబీని..ఏం స‌మాధానం చెబుతోందో.. ఏది అనుకోన‌మ్మా నీ చిరునామా అని పాడుకుంటే ఏమ‌ని రిప్ల‌యి ఇస్తుందో.? వ‌రుస ఆఫ‌ర్ల‌తో ఫుల్ జోష్ మీద ఉన్న ఈ భామ త్వ‌ర‌లో ప్రిన్స్ మ‌హేశ్ బాబుతో జోడి క‌ట్ట‌నుంది. ఈ లోగా ఆచార్య ప్ర‌మోష‌న్స్ పూర్తి కానున్నాయి. అందుకే అమ్మ‌డు టైమ్ మేనేజ్మెంట్ కుద‌ర‌క సోష‌ల్ మీడియాలో తొంగి చూడ‌డ‌మే మానేసింది. మ‌ళ్లీ ఎప్పుడో అమ్మ గారి ఆగ‌మ‌నం అని అభిమానులు క‌ళ్లింత‌లు చేసుకుని చూస్తున్నారు. ఓయ‌బ్బో ! బాగుంది క‌దా ! ఈ వింత సంబ‌రం ! అమ్మ‌గారు వ‌స్తే అయ్యాగార్ల‌కు పండగే పండగ.

ట్విట‌ర్, ఇన్ స్టా, వాట్సాప్, ఫేస్బుక్ ఇలా వేదిక ఏద‌యినా సోష‌ల్ మీడియాను విపరీతంగా వాడుకుని త‌మ‌ని తాము ప్ర‌మోట్ చేసుకోవ‌డం తార‌ల‌కు ఇప్పుడొక హాబీ ! ఈ 4 మాధ్య‌మాల్లో చురుగ్గా ఉండ‌డ‌మే కాదు త‌న ఆరోగ్య ర‌హ‌స్యాలు చెప్ప‌డంలో వీళ్లు ముందు వ‌రుస‌లో ఉంటున్న ఫిట్నెస్ ట్రైన‌ర్లు కూడా ! ఇంకా చెప్పాలంటే క‌ట్టూ బొట్టూ ముచ్చ‌ట్లు చెప్పే ఫ్యాష‌న్ ఐకాన్లు, డిజైన‌ర్లు కూడా ! ఆ విధంగా సోషల్ మీడియాను సినిమా ప్రమోష‌న్ల‌కే కాదు ఇంకా  చాలా విష‌యాలు వివ‌రించేందుకు వాడుకుంటూ ఫాలోవ‌ర్లు పెంచుకోవ‌డం ఇప్పుడొక క‌ళ. న‌ట‌న అనే క‌ళ తెలిసిన వారికి తెలియాల్సిన క‌ళ కూడా !

ఇంకా చెప్పాలంటే.. సినీ తారలు సినిమాల ప్ర‌మోష‌న్ల కన్నా సోషల్ మీడియాలోనే ఎక్కువ చురుగ్గా ఉండ‌డం ఇప్పుడు త‌ప్ప‌క చేయాల్సిన ప‌ని. తినే తిండి నుంచి కట్టుకొనే బట్టలు వ‌ర‌కు అన్ని ఊసులూ సోష‌ల్ మీడియా ఫాలోవ‌ర్స్ కు చెప్పాలి. లేదంటే ఫ్యాన్స్ హ‌ర్ట్ అవుతారు. ఆఖ‌రికి సినిమాలు, ఫ్యామిలీ, పార్టీలు, ఫిట్నెస్ క‌స‌ర‌త్తులు ఇలా ఒక్క‌టేంటి అన్నీ ఎప్ప‌టిక‌ప్పుడు చెప్పి తీరాల్సిందే ! లేదంటే ఫాలోవ‌ర్స్ కాస్త డిస్స‌పాయింట్ అయిపోతారు. ఇదే స‌మ‌యాన మ‌రో ఉద్దేశం కూడా సెల‌బ్రిటీల‌కు ఉంది. అదేంటంటే ఈ మీడియా ద్వారా ఎక్కువ మంది అభిమానుల‌ను క‌లుసుకునేందుకు వీలుంటుంద‌ని ! ముఖ్యంగా టాప్ హీరోయిన్ల సంగతి అయితే ప్ర‌త్యేకించి చెప్పనక్కర్లేదు..టైం దొరికితే చాలు ఏదో ఒక విషయం పై అప్డేట్ ఇస్తూ హ‌ల్చ‌ర్ చేస్తున్నారు.

ఆ త‌ర‌హా ముద్దుగుమ్మలల్లో ఒకరు పూజాహెగ్డే..తెలుగు  టాప్ హీరోయిన్లలో ఒకరు..ఈ క‌న్న‌డ సోయ‌గంతో సినిమా చేస్తే తప్పక హిట్ అవుతుందని దర్శ‌క ,నిర్మాతల నమ్మకం.. తెలుగు తో పాటుగా కన్నడ, తమిళ్,హిందీ చిత్రాలలో కూడా నటించి టాప్ హీరోయిన్ గా సక్సెస్ అయింది. అవుతోంది కూడా ! ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్, చిరంజీవి కలిసి నటిస్తున్న సినిమా ఆచార్య లో హీరోయిన్ గా నటిస్తోంది.రామ్ చరణ్ సరసన జోడిగా అభిమానుల‌ను అల‌రించ‌నుంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకొని రేపు విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ సినిమా పూజాహెగ్డే కు మంచి హిట్ ను అందిస్తుంది అనే నమ్మకంతో ఉంది..గతంలో అమ్మడు నటించిన సినిమాలు అన్నీ కూడా గ్లామర్ డోస్ ఉన్న పాత్రలే. కానీ ఆచార్య సినిమాలో మాత్రం అచ్చ తెలుగు అమ్మాయిలాగా కనిపిస్తుంది.రామ్ చరణ్ గట్టి పోటీని ఇస్తూ కనిపిస్తుంది..కొద్ది గంటలలో ఈ సినిమా థియెటర్లలో సందడి చేయనుంది.ఇప్పటికే మెగా అభిమానులు థియేటర్ల ను అందంగా ముస్తాబు చేశారు. అమ్మడు సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉండటం తో సోషల్‌మీడియాలో చురుగ్గా లేదు..దీంతో ఫ్యాన్స్ నిరాశ లో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version