వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల పాదయాత్ర 69 వ రోజు భద్రాద్రి కి చేరుకుంది.ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ స్కూటర్, అద్దె ఇల్లు ఉన్న కెసిఆర్ కు ఇప్పుడు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయి అని ప్రశ్నించారు.పెద్ద పెద్ద గడీలు, ప్రైవేట్ జెట్ లు , ఫామ్ హౌస్ లో వందల ఎకరాలు ఎక్కడ నుంచి వచ్చాయన్నారు.బంగారు తెలంగాణ కెసిఆర్ కుటుంబానికి బంగారం అయింది అని విమర్శించారు.టిఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో 860 కోట్లు ఉన్నాయని చెప్తున్నారు ఒకప్పుడు ఒక రూపాయి లేని అకౌంట్లో ఇన్ని వందల కోట్లు ఎలా వచ్చాయి అని అన్నారు.వడ్డీయే నెలకు 3 కోట్లు వస్తుందట అని విమర్శించారు.ఇక్కడ సరిపోలేదట..ఇప్పుడు దేశాన్ని ఉద్ధరిస్తాడట అంటూ ఎద్దేవా చేశారు.
దేశాన్ని కూడా నాశనం చేయడానికా..ఈ దరిద్రం ఇక్కడితో సరిపోదా కెసిఆర్ ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయని ఆరోపించారు షర్మిల.కెసిఆర్ అకౌంట్ లో మాత్రమే బ్యాంకు బ్యాలెన్స్ ఉండాలి, రైతులు మాత్రం అప్పులతో ఆత్మహత్యలు చేసుకోవాలా? అంటూ ప్రశ్నించారు.మంత్రుల మీద కేసులు లేవని గొప్పలు చెప్తున్నారు కదా అందరూ గౌతమ బుద్ధులే అయితే టిఆర్ఎస్ నేతల అరాచకాలకు ప్రజలు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు వైయస్ షర్మిల.