టీనేజర్స్ కి ఇంస్టాగ్రామ్ బ్యాడ్ న్యూస్.. ఇక మీద పదే నిమిషాలు..!

-

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇంస్టాగ్రామ్ ని ఉపయోగిస్తున్నారు అయితే ఇంస్టాగ్రామ్ టీనేజర్స్ కి మాత్రం బ్యాడ్ న్యూస్ చెప్పింది. అసలు వివరాల్లోకి వెళితే మెటా యజమాన్యం ఇటీవల కంటెంట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంది. చిన్నపిల్లలు టీనేజర్స్ వారి వయసుకు తగ్గ స్టోరీలు, రీల్స్ ఇతర కంటెంట్ ని మాత్రమే అందించాలని చూస్తోంది ఎక్కువ సమయం వాళ్ళు ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్లో రీల్స్ చూస్తున్నారని మెటా తాజాగా ఒక ఫీచర్ ని తీసుకువచ్చింది.

నైట్ టైం నడ్జెస్ అనే కొత్త ఫీచర్ ని స్టార్ట్ చేసింది అంటే దీని ద్వారా టీనేజర్స్ అర్ధరాత్రి ఇంస్టాగ్రామ్ లో పది నిమిషాల కంటే ఎక్కువ సమయం ని గడిపినప్పుడు ఆలస్యమైంది.. మీరు పరిమితకు మించి ఎక్కువగా దీనిలో గడిపారు మూసి వేయమని హెచ్చరిస్తుంది ఇంస్టాగ్రామ్. ఇలా ఒక అలెర్ట్ అనేది వస్తుంది దీనితో వాళ్ళు ఇన్స్టాగ్రామ్ క్లోజ్ చేసి నిద్రపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది సో ఈ ఫీచర్ ని తీసుకు రావడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news