భువనగిరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జాతీయ జెండాకు అవమానం.. అంబేడ్కర్ చిత్రపటం లేకుండా!

-

భారతదేశంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.కానీ, భువనగిరి జిల్లాలో మాత్రం రిపబ్లిక్ డే వేడుకలు కాస్త ఉద్రిక్తతకు దారీ తీశాయి. స్థానిక ఎమ్మెల్యే కంభం పాటి అనిల్ కుమార్ రెడ్డి క్యాంపు ఆఫీసులో అంబేడ్కర్ చిత్రం లేకుండానే వేడుకలను నిర్వహించడంతో దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ఎదుట బైఠాయించి దళిత సంఘాలు నిరసన తెలిపాయి.

కుంభం అనిల్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో అక్కడ స్వల్ప తోపులాట జరిగింది. ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలోనే జాతీయ జెండా తాడు తెగిపోవడంతో కింద పడిపోయే దశలో త్రివర్ణ పతాకం ఉన్నది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రతిపక్షాలు సైతం భువనగిరి ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news