తెలంగాణ విద్యార్థులకు రేవంత్ రెడ్డి శుభవార్త.. ఇకపై వారికి కూడా ఫీజు రియంబర్స్‌మెంట్!

-

 

 

తెలంగాణ విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త అందించారు. నేడు గణతంత్ర సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్ని రకాల రెగ్యులర్ కాలేజీల మాదిరిగానే ఓపెన్ యూనివర్సిటీలలో చదివేటువంటి విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని వెల్లడించారు. ఇవాళ రిపబ్లిక్ డే దినోత్సవం వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.

 

ఓపెన్ వర్సిటీలో ఫీజులు చాలా తక్కువగా ఉన్నాయన్న సీఎం రేవంత్ రెడ్డి ఇది ప్రభుత్వానికి పెద్ద భారం ఏమీ కాదని అన్నారు. దీనికి సంబంధించిన వివరాలను వెంటనే సేకరించాలని సిఎస్ శాంతి కుమారికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. 2034 తెలంగాణ సీఎం గా అవకాశం వస్తుందని రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ సమాజం తప్పకుండా నాకు పదేళ్లు అవకాశం ఇస్తుందన్నారు. 1994 నుంచి 2024 వరకు పార్టీలకు పదేళ్ల చొప్పున అవకాశం వచ్చిందని తెలిపారు.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news