తెలంగాణలో ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు రద్దు అయ్యాయి. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారికంగా వెల్లడించారు. కోవిడ్ నేపథ్యంలో తెలంగాణలో ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే ఫస్టియర్ పరీక్షలు రద్దు చేశామని.. ఇప్పుడు ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు కూడా రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఫస్ట్ ఇయర్ మార్కుల ఆధారంగా సెకండియర్ మార్కులు ఉంటాయని కూడా ఆమె పేర్కొన్నారు.
అంతేకాదు.. పరీక్షల ఫలితాలపై ఓ కమిటీని వేశామని.. రెండు లేదా మూడు రోజుల్లో విధివిధానాలను ప్రకటిస్తామని పేర్కొన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. పరీక్షలు ఎవరైనా విద్యార్థులు రాయాలనుకుంటే.. కరోనా పరిస్థితులు మెరుగుపడిన తర్వాత ఆలోచన చేస్తామని ఆమె ప్రకటించారు. కాగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు సైతం రద్దు చేస్తున్నట్లు గత ఏప్రిల్ నెలలో ప్రకటించారు. పరీక్షలు లేకుండానే విద్యార్థులనుపై తరగతులకు ప్రమోట్ చేశారు.