సావిత్రి-జమున మధ్య ఉన్న సంబంధం.. ఆసక్తికర విషయాలు

-

టాలీవుడ్ సీనియర్ నటి జమున (86) కర్ణాటకలోని హంపీలో పుట్టగా.. తల్లిదండ్రులది కులాంతర వివాహం. తండ్రి వ్యాపారవేత్త కావడంతో గుంటూరు జిల్లా దుగ్గిరాలకు వలస వచ్చారు. దీంతో ఏడేళ్ల వయసు నుంచి ఆమె దుగ్గిరాలలోనే పెరిగారు. మహానటి సావిత్రి డ్రామాలు వేసే సమయంలో ఓ సారి దుగ్గిరాల రాగా.. జమున ఇంట్లోనే ఉన్నారు. ఆ తర్వాత సావిత్రి జమునను సినిమాల్లోకి ఆహ్వానించగా.. 15 ఏళ్ల వయసులోనే ఆమె నటనా జీవితంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. జమున అప్పుడప్పుడే ఇండస్ట్రీకి వచ్చి సెటిల్ అవుతున్న రోజులవి. ఇంకా అనేక సినిమాలో నటిస్తున్న సమయంలో ఇండస్ట్రీతో మంచి స్తంభంధాలు కలిగి ఉండేది అంతేకాదు తనతో నటిస్తున్న ఓ కుర్ర హీరోలతో ప్రేమలో పడింది అని కూడా అందరూ చెప్పుకునేవారు. అంతేకాదు ఆ హీరోనీ జమున పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుందట.అయితే ఆమే ప్రేమ మత్తును వదిలించారు నటుడు ఎస్వీఆర్.

ఓ ఇంటర్వ్యూలో జమున మాట్లాడుతూ.. మా అబ్బాయిని ఉయ్యాలలో వేసే రోజు సావిత్రిని ఇంటికి ఆహ్వానించా.. అప్పుడు సావిత్రి ఫుల్ గా తాగేసి ఉంది. మా అబ్బాయిని ఎత్తుకొని.. ఆడించింది. ఆ తర్వాత నన్ను ఒక రూమ్ లోకి తీసుకెళ్లి బోరున ఏడ్చింది. నన్ను గట్టిగా కౌగలించుకుని పెద్దగా ఏడ్చేసింది. నువు చాలా అదృష్టవంతురాలివే..చెల్లి. మంచి భర్త.. కొడుకు నిండు సంసారం..చాలా సంతోషంగా ఉంది..నాకు ఈ అదృష్టం లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆతర్వాత నన్ను జెమినీ అలా చేశాడు..ఇలా చేశాడని అతడిగురించి చెప్పి ఏడ్చేసింది అన్నారు. అప్పుడు నేను తనకు దైర్యం చెప్పే ప్రయత్నం చేశా.. జరిగిందేదో జరిగిపోయింది. ఇద్దరు పిల్లలున్నారు నీకు ఎం కాదు అంటూ ఓదార్చా అని అన్నారు జామున.

Read more RELATED
Recommended to you

Exit mobile version