కేసీఆర్ వర్సెస్ గవర్నర్..బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ..ఇదేం రచ్చ!

-

తెలంగాణలో రాజకీయాలు మరింత వేడెక్కాయి..బి‌ఆర్‌ఎస్-బి‌జే‌పిల మధ్య రాజకీయ యుద్ధం తారస్థాయిలో నడుస్తోంది. అయితే వీరి రాజకీయ యుద్ధం కాస్త ఇప్పుడు రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ అన్నట్లు మారింది. చాలా రోజుల నుంచి కేసీఆర్ ప్రభుత్వం, గవర్నర్ తమిళిసై ల మధ్య రగడ నడుస్తోంది. అసలు కే‌సి‌ఆర్ ప్రభుత్వం గవర్నర్‌కు ప్రోటోకాల్ పాటించడం లేదని చెప్పి తమిళిసై ఫైర్ అవుతున్నారు.

అదే సమయంలో ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని బిల్లులు గవర్నర్ వద్దే పెండింగ్ లో ఉన్నాయి. దీంతో బి‌ఆర్‌ఎస్ నేతలు..గవర్నర్ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు. బి‌జే‌పి ప్రతినిధిగా గవర్నర్ పనిచేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. అయితే ఇటీవల బి‌ఆర్‌ఎస్ ఆవిర్భావ సభలో గవర్నర్ వ్యవస్థపై కే‌సి‌ఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అదే సమయంలో గవర్నర్ సైతం కే‌సి‌ఆర్‌కు కౌంటర్లు ఇచ్చారు. ఈ రచ్చ ఇలా నడుస్తుండగానే..రిపబ్లిక్ డే వేడుకలు సైతం రెండు పార్టీల మధ్య వార్ అన్నట్లు నడిచింది.

 

రాజ్ భవన్‌లో జరిగిన వేడుకలకు కే‌సి‌ఆర్ హాజరు కాలేదు..ప్రభుత్వం తరుపున సి‌ఎస్ మాత్రమే హాజరయ్యారు. ఇక రిపబ్లిక్ వేడుకల్లో తమిళిసై కే‌సి‌ఆర్ ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు చేశారు. ఫార్మ్ హౌస్‌లు కాదు..ఫార్మ్‌లు కావాలని అన్నారు. ఇంకా పరోక్షంగా కే‌సి‌ఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దీంతో బి‌ఆర్‌ఎస్ నేతలు వరుసపెట్టి గవర్నర్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ఇలా బి‌ఆర్‌ఎస్ నేతలు గవర్నర్‌ని టార్గెట్ చేయడంతో అటు రివర్స్ లో బి‌జే‌పి నేతలు..కే‌సి‌ఆర్‌ని టార్గెట్ చేశారు.

ఇదే సమయంలో బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి..గవర్నర్ పై వివాదాస్పద  వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.  అసలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావని, ఏ రాజ్యాంగాన్ని పాటిస్తున్నావని, అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లులను గవర్నరు ము** కింద పెట్టుకుందంటూ గవర్నర్‌ని ఉద్దేశించి కౌశిక్ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై బి‌జే‌పి నేతలు ఫైర్ అవుతున్నారు. బిల్లుల ఆమోద ప్రక్రియపై కనీసం అవగాహన లేని కౌశిక్ లాంటి నీచమైన వ్యక్తులకు కే‌సి‌ఆర్ పదవులు కట్టబెట్టారని, రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న వారిపైకి ఊరకుక్కలని విడిచిపెట్టారని బి‌జే‌పి నాయకురాలు డి‌కే అరుణ ఫైర్ అయ్యారు. ఇలా కే‌సి‌ఆర్ వర్సెస్ గవర్నర్ అన్నట్లు సాగుతున్న పోరులో బి‌జే‌పి వర్సెస్ బి‌ఆర్‌ఎస్ మాటల యుద్ధం జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version