వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు బంద్..కస్టమర్లు పైన ఎఫెక్ట్..!

-

మనకి సాధారణంగా బ్యాంకుల్లో ముఖ్యమైన పనులు ఉంటూ ఉంటాయి. బ్యాంకులకు ఎప్పుడు సెలవు అనేది చూసుకుని దానికి తగ్గట్టుగా మనం పనులని పూర్తి చేసుకోవాలి. ఒకవేళ కనుక సరైన టైం కి బ్యాంకు పనులు అవ్వకపోతే మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో బ్యాంకులకు ఏయే రోజులు సేవలు అనేది చూడండి. దానికి తగ్గట్టుగా మీ పనులు పూర్తి చేసుకోండి.

ఇక పూర్తి వివరాలను చూస్తే.. జనవరి 30, 31 తేదీల్లో బ్యాంక్ యూనియన్లు దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. కనుక ఆ రోజులు బ్యాంకులు పని చేయవు. బ్యాంకులు మూతపడనున్నాయి. అలానే మరో రెండు రోజులు కూడా సెలవుల వలన క్లోజ్. జనవరి 28, 29, 30, 31 తేదీల్లో బ్యాంక్‌‌లు పని చెయ్యవు. బ్యాంక్ యూనియన్లు సమ్మె బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు సమ్మె చెయ్యాలని అనుకున్నాయి.

అందుకే జనవరి 30, 31 తేదీల్లో సమ్మెకు పిలుపునిచ్చాయి. ఇది బ్యాంక్ కస్టమర్లపై ప్రభావం చూపనుంది. అలానే ఏటీఎం సేవలపైనా ప్రభావం చూపనుంది. బ్యాంకుల పని రోజులను ఐదు రోజులకు పరిమితం చేయాలని బ్యాంక్ ఉద్యోగులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అలానే పెన్షన్ వ్యవస్థను కూడా రద్దు చేయాలని అడుగుతున్నారు. జీతాలు కూడా ఎప్పటి నుంచో పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అలానే కొత్తగా నియామకాలను కూడా వేగవంతం చేయాలని కోరుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version