టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఆదాయం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

-

టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఫార్మాట్ ఏదైనా పరుగుల ప్రవాహం సృష్టిస్తూ టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. దాంతో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న నానుడిని ఈ ముంబయి హిట్ మ్యాన్ అక్షరాలా అమలు చేస్తున్నాడు. భార్య రితికా సజ్దే సహకారంతో అనేక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటూ క్రికెటేతర మార్గాల్లోనూ భారీగా ఆర్జిస్తున్నాడు.

ప్రస్తుతం రోహిత్ శర్మ ప్రచారం చేస్తున్న బ్రాండ్ల సంఖ్య 22. ఏడాదికి రూ.75 కోట్ల వరకు సంపాదిస్తున్నట్టు మార్కెట్ వర్గాలంటున్నాయి. ఇంగ్లాండ్ లో జరిగిన వరల్డ్ కప్ ముందు ఓ మోస్తరు మార్కెట్ వాల్యూ కలిగిన రోహిత్, ఆ మెగాటోర్నీలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో వాణిజ్య ప్రకటనలు, ప్రచార ఒప్పందాల కోసం కంపెనీలు బారులు తీరాయి. ఈ ఒక్క సీజన్ లోనే రోహిత్ శర్మ 10 కొత్త ఒప్పందాలు చేసుకున్నాడంటే అతడి విలువ ఏంటో అర్థమవుతోంది. ఈ తరహా సంపాదనలో రోహిత్ శర్మ కంటే పైన విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version