రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అమ్మ ఒడి సంక్షేమ కార్యక్రమం గురువారం అట్టహాసంగా రా ష్ట్రంలో ప్రారంభమైంది. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో చదువుకునే తెల్లరేషన్ కార్డు సహా బీపీఎల్ పరిధి లోకి వచ్చే 1-10 విద్యార్థుల తల్లులకు జగన్ సర్కారు రూ.15 వేలను ఒకేసారి వారి వారి అకౌంట్లలో వేశారు. దీని నుంచి రాష్ట్ర ప్రభుత్వం చాలానే ఆశించింది. విద్యార్థుల డ్రాపౌట్లు తగ్గడంతోపాటు, విద్యార్థులను కూ లి నాలి పనులకు పేదతల్లిదండ్రులు మళ్లించకుండా ప్రశాంతంగా విద్యార్థులు తమ చదువులుతాము చ దువుకోవడంతోపాటు నాణ్యమైన విధంగా ఉంటారనే సదుద్దేశంతో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండి కూడా జగన్ ప్రభుత్వం దీనిని అమలు చేసింది.
అది కూడా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఏడు మాసాల వ్యవధిలోనే అమ్మ ఒడి వంటి ప్రతిష్టాత్మక పథ కం అమల్లోకి రావడం నిజంగా అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వంపై ప్రశంసలు కురిపి స్తున్నారు. దేశంలో ఎక్కడా కూడా ముఖ్యంగా అభివృద్ధిలో దూసుకుపోతున్నామని చెప్పుకొనే తెలంగాణ వంటి రాష్ట్రాల్లోనూ ఇలాంటి పథకం పేద విద్యార్థులకు ఎక్కడా కూడా అందుబాటులోకి లేదు. దేశంలోనే లేని ఇలాంటి పథకాన్ని జగన్ ప్రభుత్వం అమలు చేస్తుండడం ఒక రికార్డయితే.. రూ.15 వేలు ఒకే సారి 43 లక్షల మంది తల్లుల అకౌంట్లలో పడడం మరో రికార్డుగా నిలిచింది.
అయితే, రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధినేత చంద్రబాబు ఈ అమ్మ ఒడి నుంచి ప్రజలను దృ ష్టి మరిల్చే కార్యక్రమానికి, ఒకరకంగా కుట్రకు ప్రయత్నించారనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో ఎన్నికల సమయంలో పక్కాగా ప్రజల ఓట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నించి మహిళలను సెంటిమెంట్ చేసుకుని పసుపు కుంకమ కింద రూ.10 వేలను ఇచ్చారు చంద్రబాబు. అయితే, అది కూడా మూడు విడతలుగా విదిలించారు. అయినా కూడా ఆయన అనుకూల మీడియా భాజా భజంత్రీలు మోగించింది. ఇంకేముంది బంగారం షాపులు కిటకిటలాడుతున్నాయి.. పేదల ఇంట్లో పడిసి తాండవం చేస్తోందంటూ.. వార్తలు కుమ్మేసింది. కానీ, ఇప్పుడు అదే పేదలకు జగన్ ప్రభుత్వం జల్సాలకు కాకుండా కేవలం చదువుల నిమిత్తం రూ.15 వేలను ఒకేసారి ఇస్తే.. మాత్రం ఈ ముఠాకు ఒక్క అక్షరం రాసేందుకు పత్రికల్లో పేజీలు లేవు.
చిన్నాపాటి వార్త ప్రసారం చేసేందుకు చానళ్లలో టైం లభించలేదు. సో.. సోకాల్డ్ అధినేతలు చెప్పుకొనే మీడియా స్వేచ్ఛలో ఇది కూడా ఉండి ఉంటుంది. ఇక,చంద్రబాబు తన జీవితంలోనే ఎన్నడూ లేని(ఆయనే చెప్పుకొన్నాడు) విధంగా జోలె పట్టుకుని అమరావతి ఉద్యమానికి బయలుదేరాడు., ఇది ఎవరికి తెలియని రాజకీయ నాటకం. కేవలం అమ్మ ఒడి ప్రభావం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు బాబు ఆడిన నాటకంగా మహిళలు తిట్టిపోస్తున్నారు. అదేసమయంలో ఊరూ వాడా కూడా జగన్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తున్నారు. ప్రజల మనసులు గెలుచుకోలేని చంద్రబాబు ఇలాంటి కుట్రలతో సాధించేది ఏంటని అంటున్నారు పరిశీలకులు.