ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. కొన్ని రోజులుగా టీడీపీ ఆధ్వర్యంలో నా యకులు కార్యకర్తలు, అమరాతి, గుంటూరు ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్నారు. ఉద్యమమో.. ఆందోళనో ఏదో ఒక రూపంలో రోజూ చేస్తున్నారు. ఇక, చంద్రబాబు జోలె పట్టి భిక్షాటన రాజకీయం చేస్తున్నారు. కట్ చేస్తే.. తాజాగా రాజధాని ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్న గ్రామాలకు మాజీ వైసీపీ నాయకుడు, ప్రస్తుతం టీడీపీ నేత వంగవీటి రాధా వచ్చారు. తనదైన శైలిలో ఆయన ఇక్కడి ప్రజలకు మద్దతు పలికారు.
ఈ సందర్భంగా.. వంగవీటి రాధాకు మహిళలు తమ గోడును వినిపించుకున్నారు. పోలీసులు తమపై దాడి చేశారని.. వంగవీటి రాధా ముందు మందడం మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. సహజంగానే ఇక్కడి ప్రజలు ఎవరు వచ్చినా తమ సమస్యలు చెప్పుకొంటున్నారు. దీనిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అయితే, వీరికి నచ్చజెపుతున్న నాయకులతో పాటు జగన్ అంతు చూస్తామని చెబుతున్న వారు.. కేంద్రం ఒప్పుకోదని అంటున్న నాయకులు కూడా ఉన్నారు. ఎవరి ధోరణిలో వారు ఇక్కడ ప్రసంగాలు చేస్తున్నారు.
తాజాగా ఇక్కడ పర్యటించిన రాధా కూడా తనదైన శైలిలో ప్రసంగించారు. ఏ జిల్లాలో అయితే వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణం చేశారో ఆ జిల్లాకే వెన్నుపోటు పొడిచారని విమర్శలు గుప్పించారు. వైసీపీని 30 రాజ ధానులైనా అనుకోనివ్వండి కానీ.. మాకు తెలిసి ఒకటే రాజధాని, ఒకటే రాష్ట్రమని వంగవీటి రాధా చెప్పు కొచ్చారు. దీంతో అందరూ షాకయ్యారు,. ఇంత ప్రగాఢంగా టీడీపీ అధినేత చంద్రబాబు కూడాఫిక్సవలేదు కదా.. మరి రాధా అన్న ఎలా ఫిక్సయ్యారంటూ పెద్ద ఎత్తున చెవులు కొరుక్కున్నారు.
అక్కడెక్కడో రాజధాని వస్తోందంటే ఇప్పటి నుంచే చంద్రబాబు ఆందోళనలు చేస్తున్నారు. మరి రాధా పాటి ఆలోచన ఆయనకు లేదనుకోవాలా? ప్రబుత్వం ఎక్కడ రాజధాని ఏర్పాటు చేసినా.. తమకు అమరావతే రాజధాని అని ఒక్క ముక్కలో తేల్చేదానికి చంద్రబాబు ఇంత హడావుడి ఎందుకు చేస్తున్నారు? అనే ప్రశ్న ఉదయిస్తోంది. సో.. రాధా ఫిక్స్ అయిన తీరు బాగుంది కదూ!!