వైరల్ వీడియో; కాశ్మీర్ లో గర్భిణి ప్రాణాలు కాపాడిన వంద మంది సైనికులు…!

-

ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు నిలబడే వాడే సైనికుడు. ప్రమాదాలు జరిగినా, మంటల్లో చిక్కుకున్నా, ప్రాణాల మీదకు వచ్చినా, ఎన్నికల బందోబస్త్ అయినా, భూకంపం, సునామీ ఏది అయినా సరే ప్రజల కోసం వచ్చేది సైనికుడే. అందుకే జై జవాన్ జైకిసాన్ అంటూ ఉంటారు. రైతు దేశానికి అన్నం పెడితే సైనికుడు దేశానికి రక్షణగా నిలబడుతూ ఉంటాడు. ఎన్ని ప్రమాదాలు వచ్చినా నేను ఉన్నా అంటాడు.

ఇప్పుడు సైనికులు కొందరు ఒక మహిళ ప్రాణాలు కాపాడిన విధానం ఇదే విషయాన్ని చెప్పింది. సాధారణంగా కాశ్మీర్ లో ప్రకృతి విపత్తులు ఎక్కువగా ఉంటాయి. మంచు తుఫాన్ లు ఆ ప్రాంతాన్ని ఎప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. దీనితో రవాణా సౌకర్యం అస్తవ్యస్తంగా మారిపోతుంది. మనుషులు బయటకు వెళ్ళాలి అంటే నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు.

ఇలాగే ఒక గర్భిణి తీవ్రంగా ఇబ్బంది పడింది. కాశ్మీర్ లో మంచు తుఫానులో నేప్పులతో గర్భిణి శామీమా తీవ్రంగా ఇబ్బందులు పడుతుంది. దీనితో ఎం చెయ్యాలో అర్ధం కాని పరిస్థితుల్లో ఆమెను గమనించిన వంద మంది సైనికులు హాస్పిటల్ కి చేర్చుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రతికూల పరిస్థితుల్లో ఆమెను కాపాడటానికి వాళ్ళు ముందుకి వచ్చి ప్రాణాలు కాపాడారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version