అంతర్జాతీయ విమాన సర్వీసులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్…ప్రారంభమయ్యేది ఎప్పుడంటే..

-

అంతర్జాతీయ విమాన సర్వీసులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది. ఇందుకు గానూ కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది చివరినాటికి పూర్తిస్థాయిలో విమాన సర్వీసులు ప్రారంభిస్తామని ఈ మేరకు పౌర విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్ బన్సల్ వెల్లడించారు. ఇటీవల ఓ కార్యక్రమంలో సివిల్ ఏవియేషన్ మినిస్టర్ జ్యోతిరాధిత్యా సింథియా మాట్లాడుతూ..  కరోనా కేసులు తగ్గడం, వ్యాక్సినేషన్ పెరగడంతో గతంలో లాగే అంతర్జాతీయ విమాన సర్వీసులను త్వరలో నడుపుతామని ప్రకటించారు.

ఇటీవల దేశీయ విమాన సర్వీసులపై కూడా నిబంధలను ఎత్తివేశారు. సీట్ల పరిమితిపై అక్టోబర్18 నుంచి కేంద్రం ఆంక్షలు ఎత్తివేసింది. గతేడాది లాక్ డౌన్ సమయంలో దేశీయ వివానాలపై పూర్తిగా నిషేధం విధించిన కేంద్రం.. 2020 మే25 నుంచి కోవిడ్ నిబంధనల మేరకు 33 శాతం సీటింగ్ కెపాసిటీతో నడిపేందరకు అనుమతి ఇచ్చింది. ఆ తరువాత దశల వారీగా సీటింగ్ కెపాసిటీని పెంచింది. సెప్టెంబర్ లో 85 శాతం పెంచిన.. ప్రభుత్వం అక్టోబర్ నుంచి పూర్తి స్థాయిలో సీటింగ్ కు అనుమతి ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version