తెలుగు వచ్చిన వారికి తెలుగు కంటే కంఫర్ట్‌గా మరే భాష ఉండదనిపిస్తుంది. మన భావాలను వ్యక్తపరిచేందుకు తెలుగులో అయితేనే బాగా చెప్పగలం.. మాతృభాషతోనే మనిషి జీవితం మెుదలవుతుంది. అమ్మ నేర్పించే మాతృభాష అమృతం లాగా ఉంటుంది. నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం.. మరీ ఈ సందర్భంగా మన మాతృభాష తెలుగు గురించి ఆసక్తికర విషయాలు మీ కోసం..
శ్రీ కృష్ణదేవరాయాలు ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని వ్యాఖ్యానించాడు. తల్లే మెుదటి గురువు, తల్లే ఒడి బిడ్డకు మెుదటి బడి. జీవితంలో మెుదటగా నేర్చుకునేది ఏదైనా ఉందంటే.. అది మాతృ భాషే. తల్లి ఏ భాషలో అయితే మాట్లాడుతుందో.. బిడ్డకు మొదట అదే భాష వస్తుంది. బుజ్జి బుజ్జి మాటలతో అమ్మ, నాన్న, అత్త, అంటూ చెప్పడం మొదలేస్తారు. అమ్మ పలికే.. ప్రతీ పలుకు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తుంటుంది బిడ్డ. అందుకే ప్రతీ ఒక్కరూ అమ్మను కాపాడుకున్నట్టే మాతృభాషను కూడా కాపాడుకోవాలి. పరభాషను ప్రేమించాలి.. మాతృభాషను గుండెల్లో పెట్టుకోవాలి. అందుకోసమే.. ప్రతీ ఏటా ఫిబ్రవరి 21న మాతృభాషా దినోత్సవం నిర్వహిస్తారు. తెలుగు రావడం అనేది గర్వకారణంగా భావించాలి కానీ నేడు చాలామంది తెలుగు మాత్రమే వచ్చింది అని సిగ్గుచేటుగా ఫీల్ అవుతున్నారు. ఇంగ్లీష్ అనేది కూడా ఒక భాష మాత్రమే..అది ఏం నాలెడ్జ్ కాదు.. నేర్చుకోవడంలో తప్పు లేదు. కానీ తెలుగు భాష మాత్రమే కాదు.. ఎమోషన్.. నీ సంతోషాన్ని, గుండెకు అయిన గాయాన్ని తెలుగులో కంటే గొప్పగా వర్ణించగలమా.?
అమ్మ భాషను రక్షించుకోవడానికి 1999లో 30వ యునెస్కో మహాసభ.. ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా ప్రకటించింది. ఆత్మగౌరవాన్ని ప్రసాదించే.. అమ్మ భాషను గౌరవించడం ప్రతీ ఒక్కరి బాధ్యత. ఏ జాతి అయితే మాతృభాషను కీర్తిస్తుందో ఆ జాతి మరింత అభివృద్ధి చెందుతుంది. ఇక తెలుగు భాష విషయానికి వస్తే.. వేల ఏళ్ల నుంచి మనుగడలో ఉంది..కాలం మారుతుంది. భాషలో కాస్త మార్పులు రావొచ్చు. అయితే అందులోని మాధుర్యం మాత్రం అలానే ఉంది. అది తెలుగు భాష గొప్పదనం.
తెలుగులోని ప్రతి పదం అచ్చు శబ్ధంతో ముగుస్తుంది. మన తెలుగులోనే అత్యధిక సంఖ్యలో సామెతలు ఉన్నాయి. భారతదేశంలో తెలుగు మాట్లాడేవారు ఎక్కువే ఉన్నారు. ఇటాలియన్ వర్తకులు.. తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ గా పిలిచారు. క్రీస్తుపూర్వం 400 నుంచి తెలుగు భాష ఉనికిలో ఉంది. తెలుగులో మాట్లాడితే 7200 నరాలు యాక్టివేట్ అవుతాయని సైంటిఫిక్‌గా నిరూపితమైంది.
తెలుగు రాష్ట్రాలతో పాటు భారత దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ తెలుగు మాట్లాడేవారు ఉన్నారు. శ్రీలంకకు చెందిన జిప్సీ జాతి ప్రజలు కూడా తెలుగు మాట్లాడుతారు తెలుసా..?. భారతదేశంలో స్థానిక భాషలు మాట్లాడే స్థానంలో తెలుగుది మూడో స్థానం. తెలుగులో తియ్యదనం ఉంది. ప్రతి పదం పలుకుతుంటే.. అమ్మతో మాట్లాడినట్టుగానే ఉంటుంది. అంతెందుకు మనం నార్త్‌సైడ్ వెళ్లి అక్కడ ఒక్క తెలుగు వాళ్లు కనిపించారంటే.. మన దగ్గర బంధువులే అన్న భావన వచ్చేస్తుంది. తెలియని ధైర్యం.