డాక్టర్ చేసిన నిర్వాకం వింటే బిత్తరపోవడం ఖాయం. ఇలాంటి వారు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోతారు. ఓ పేషెంట్‌కు కాలేయ మార్పిడి చేసిన డాక్టర్.. ఆ అవయవంపై తన ఆటోగ్రాఫ్‌ను సైతం చెక్కాడు. ఆపరేషన్ పెయిల్ కావడం, పేషెంట్ లివర్‌పై 1.6 అంగుళాల సైజులో అక్షరాలు ఉండటంతో మరో వైద్యుడు గుర్తించడంతో అసలు విషయం బయట పడింది.
ఈ దారుణానికి బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్ క్వీన్ ఎలిజబెత్ హాస్పిటల్‌లో సర్జన్ స్పెషలిస్ట్ డాక్టర్ సైమన్ ఒడిగట్టాడు. 2013లో జరిగిన ఈ సంఘటనపై ట్రైబ్యునల్ తీర్పుతో తాజాగా సంచలనమైంది. ఆర్గాన్ బీమ్ మెషీన్‌ను ఉపయోగించి పేషెంట్ లివర్‌పై ఆటోగ్రాఫ్ చెక్కినట్లు డాక్టర్ సైమన్ అంగీకరించాడు. ఆ డాక్టర్‌కు 2017లోనే రూ.10లక్షల ఫైన్ వేసిన కోర్టు, వైద్య వృత్తి నిర్వహించకుండా 2020, డిసెంబర్‌లో సస్పెన్షన్ విధించింది.