నైజీరియాలో తుపాకీ మోత.. 50 మంది దుర్మరణం

-

నైజీరియాలో మరోసారి తుపాకీ మోత మోగింది. ఉత్తర మధ్య నైజీరియా ప్రాంతంలోని బెన్యూ రాష్ట్రంలో ఉన్న ఉమోగిడి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. సాయుధులు రెండు సార్లు జరిపిన కాల్పుల్లో సుమారు 50 మంది దుర్మరణం చెందారు. మంగళవారం రోజున సాయుధులు మార్కెట్​లో విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.

మరుసటి రోజు బుధవారం అదే ప్రాంతంలో దుండగుడులు మరోసారి రెచ్చిపోయారు. ఈ ఘటనలో 47 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఓ పోలీసు అధికారి కూడా ఉన్నారు. అయితే, ఈ దాడుల వెనుక ఉన్న ఉద్దేశం తెలియలేదు. కానీ ఈ రెండు ఘటనలకు సంబంధం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కాల్పులకు ఇప్పటివరకు ఎవరూ బాధ్యత వహించలేదని తెలిపారు. అయితే, ఈ ప్రాంతంలో రైతులు, స్థానిక పశువుల కాపరుల మధ్య గొడవలు జరుగుతున్నాయని వెల్లడించారు. స్థానిక పశువుల కాపరులే ఈ దాడులకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version