బుర్కినా ఫాసోలో నరమేధం.. సైనిక దుస్తుల్లో వచ్చి 60 మందిని చంపిన దుండగులు

-

ఆర్మీ యూనిఫారమ్​లో వచ్చిన దుండగులు 60 మంది పౌరులను అతి క్రూరంగా హతమార్చిన ఘటన బుర్కినా ఫాసో అనే పశ్చిమ ఆఫ్రికా దేశంలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టామని బుర్కినా ఫాసో అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

అల్‌ఖైదా, ఇస్లామిక్‌ స్టేట్‌తో సంబంధమున్న కొంత మంది జిహాదీలు.. ఈ దేశంలోకి అక్రమంగా చొరబడ్డారు. వేలాది మందిని చంపి.. దాదాపు 20 లక్షల మంది ఇతర ప్రాంతాలకు తరలిపోయేలా చేశారు. ఒకప్పుడు శాంతియుతంగా ఉన్న దేశంలో అల్లకల్లోలం సృష్టించి.. విభజించారు. దీంతో గత ఏడాది రెండు సార్లు ఘర్షణలు చెలరేగాయి.

మరోవైపు సెప్టెంబర్​లో రెండో సారి జరిగిన తిరుగుబాటులో.. బుర్కినా ఫాసో ఆర్మీ అధికారి ఆ దేశ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, పౌరుల హత్యలు పెరిగాయయని మానవ హక్కుల సంఘాల ఆరోపిస్తున్నాయి. భద్రతా దళాలే ఈ ఘటనలకు పాల్పడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version