బ్రిక్స్‌ కూటమిలో సభ్యత్వానికి అల్జీరియా దేశం దరఖాస్తు

-

ఉత్తర ఆఫ్రికా దేశమైన అల్జీరియా.. బ్రిక్స్‌ కూటమిలో చేరడానికి ఆసక్తిగా ఉంది. ఈ కూటమిలో తమకు సభ్యత్వం కల్పించాలని కోరుతోంది. అంతే కాకుండా.. కూటమికి చెందిన బ్రిక్స్‌ బ్యాంకు అయిన న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకులో 1.5 బిలియన్‌ డాలర్లతో షేర్‌ హోల్డర్​గా ఉంటామని దరఖాస్తు చేసుకుంది. కొత్త ఆర్థిక అవకాశాలను అందిపుచ్చుకునేందుకు బ్రిక్స్‌లో చేరాలనుకుంటున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు అబ్దెల్‌మాజిద్ టెబ్బౌన్‌ తన చైనా పర్యటనలో భాగంగా చేసిన వ్యాఖ్యలను అంతర్జాతీయ మీడియా కథనాలు తాజాగా పేర్కొన్నాయి. బ్రిక్స్‌లో అల్జీరియా ప్రవేశించడానికి ఇప్పటికే చైనా, రష్యాలు మద్దతు ప్రకటించాయి.

మరోవైపు బ్రిక్స్‌ 15వ సదస్సుకు దక్షిణాఫ్రిక ఆతిథ్యం ఇస్తుంది. ఆగస్టు 22 నుంచి 25 వరకు జొహెన్నెస్‌బర్గ్‌లో ఈ సమావేశాలకు బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారు.. ఈ బ్రిక్స్‌ సదస్సుకు సర్వం సిద్ధం చేశామని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమాఫోసా ప్రకటించారు. కరోనా మహమ్మారి విజృంభన అనంతరం సభ్యదేశాల ప్రతినిధులు వ్యక్తిగతంగా హాజరవుతున్న తొలి బ్రిక్స్‌ సమావేశం ఇదే.

Read more RELATED
Recommended to you

Exit mobile version