నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ఉధృతి నమోదు అవుతోంది. ఒక లక్ష 50 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చింది. గడిచిన పన్నెండు గంటలలో ప్రాజెక్టులోకి ఎనిమిది టీఎంసీల వరద చేరింది. ఔట్ ఫ్లో 807 క్యూసెక్కులుగా నమోదు అయింది.
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుతం 1079.10 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి సామర్థ్యం 90 టీఎంసీ లు కాగా, ప్రస్తుతం 49.968టీఎంసీ ల నీరు నిల్వ ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇక అటు భద్రాచలం వద్ద తగ్గింది గోదావరి వరద. ప్రస్తుతం 39.9 అడుగుల వద్ద గోదావరి నీటి మట్టం ఉంది. 43 అడుగులకు మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఎగువ నుంచి తగ్గింది వరద. అయితే.. ఇవాళ మధ్యాహ్నం వరద మళ్లీ పెరిగే ఛాన్స్ ఉంది.