ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విదేశాల్లో మామూలు క్రేజ్ ఉండదు. ఆయన పాపులారిటీ గురించి తెలిసిందే. విదేశీయులే కాకుండా అక్కడి నేతలు కూడా మోదీ పాలనకు ఫిదా అవుతుంటారు. తాజాగా సీనియర్ అమెరికన్ పార్లమెంటు (కాంగ్రెస్) సభ్యుడు బ్రాడ్ షెర్మన్ కూడా మోదీ పాలనపై ప్రశంసలు కురిపించారు. భారతదేశ ఆర్థిక ప్రగతికి నరేంద్ర మోదీ ప్రతీకగా నిలుస్తున్నారని కొనియాడారు. 2014లో ప్రధాని పదవి చేపట్టిననాటి నుంచి మోదీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను షెర్మన్ ప్రశంసించారు.
140 కోట్ల భారతీయులు కలసికట్టుగా తమ దేశాన్ని విజయపథంలో పరుగులు పెట్టించడానికి మోదీ కృషి చేస్తున్నారు. మోదీ హయాంలో భారత్-అమెరికా సంబంధాలు మరింత బలపడ్డాయి. రష్యాతో భారత్ రక్షణ బంధం మాత్రం ఒక సమస్యగా ఉంది. అదే సమయంలో భారత్-అమెరికాల సంయుక్త సైనిక విన్యాసాలు, సహకారం వృద్ధి చెందుతున్నాయి. అని పీటఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రాడ్ షెర్మన్ తెలిపారు. అమెరికాలోని భారతీయులు అత్యున్నత విద్యావంతులు, అత్యధిక ఆర్జన పరులని షెర్మన్ ఈ సందర్భంగా ఉద్ఘాటించారు.