హవాయ్​లో భీకర కార్చిచ్చు.. 56 మంది దుర్మరణం.. బూడిదైన వేయి ఇండ్లు

-

అమెరికాలోని హవాయి దీవిని భీకర కార్చిచ్చు అట్టుడికిస్తోంది. ఈ కార్చిచ్చు ప్రధానంగా లహైనా రిసార్టు నగరంలో బీభత్సం సృష్టించింది. కార్చిచ్చు తీవ్రతకు దాదాపు 56 మంది ప్రాణాలు కోల్పోయినట్లు మావీ కౌంటీ అధికారులు వెల్లడించారు. హరికేన్‌ ప్రభావంతో బలమైన గాలులు వీస్తున్నాయని, ఫలితంగా కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తోందని తెలిపారు. తాజా మంటల ధాటికి వేయికి పైగా ఇండ్లు కాలిబూడిదయ్యాయని వెల్లడించారు. అనేక కార్లు కాలిబూడిదయ్యాయని చెప్పారు.

కార్చిచ్చు ప్రభావంతో వీధుల్లో దట్టమైన పొగ అలుముకుందని అధికారులు తెలిపారు. మంగళవారం రాత్రి నుంచి ఈ కార్చిచ్చు విస్తరిస్తోందని.. నలువైపులా మంటలు చుట్టుముట్టడంతో హవాయిలోని పశ్చిమ భాగానికి ఇతర ప్రాంతాలతో సంబంధాలు దాదాపుగా తెగిపోయాయని చెప్పారు. 16 రోడ్లను మూసివేశామని.. కేవలం ఒకే ఒక్క హైవే అందుబాటులో ఉందని.. ఆ మార్గంలోనే వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు వివరించారు. పొగ, మంటల బారి నుంచి తప్పించుకునేందుకు కొందరు పసిఫిక్‌ మహాసముద్రంలోకి దూకి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version