తెలంగాణ ప్రజలకు బిగ్‌ అలర్ట్..రేపటి నుంచి భారీ వర్షాలు !

-

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్‌ అలర్ఠ్‌. మళ్లీ తెలంగాణకు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో జల్లులు కురుస్తాయంది.

నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, హనుమకొండ, కామారెడ్డి, వరంగల్, సూర్యపేట, నల్గొండ, కొత్తగూడెం, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక అటు హైదరాబాద్‌ మహా నగరంలో ఉక్కపోతతో జనాలు అల్లాడుతున్నారు. గత నాలుగు రోజులుగా హైదరాబాద్‌ మహా నగరంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. దీంతో ఉక్కపోతతో జనాలు అల్లాడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version