ఆసియాలోనే తొలిసారి వెరైటీగా వెడ్డింగ్ రిసెప్షన్..!

-

ఈ నాటి కాలంలో పెళ్లిళ్లు క‌ళ్లు చెదిరేలా చోటు చేసుకుంటున్నాయి. క‌రోనా ప‌రిస్థితుల వ‌ల్ల వివాహాలు వినూతంగా వ‌ర్చువ‌ల్ ప‌ద్ద‌తిలో చేయ‌డం చూస్తున్నాం.. ఈ కోవేల‌కే మ‌రొక వివాహ వేడుక చేరింది. కొవిడ్ నిబంధ‌న‌ల దృష్ట్యా ప‌రిమితం సంఖ్య‌తోనే త‌మిళ‌నాడుకు చెందిన ఓ జంట వివాహం చేసుకుంది. కానీ మ్యారేజ్ రిసెప్ష‌న్‌ను మాత్రం మెటావ‌ర్స్ టెక్నాల‌జి స‌హాయంతో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుపుకుంది.

మోటావ‌ర్స్ టెక్నాల‌జీతో ఆసియా ఖండంలో జ‌రిగిన తొలి వెడ్డింగ్ రిసెప్ష‌న్ ఇదే కావ‌డం విశేషం. శివ‌లింగ‌పురం గ్రామానికి చెందిన దినేష్ జ‌న‌గ‌నందిని వివాహం ఈనెల 06న జ‌రిగింది. దినేష్ ఐఐటీ మ‌ద్రాస్‌లో ప్రాజెక్ట్ అసోసియేట్ ప‌ని చేస్తున్నాడు. జ‌న‌గ‌నందిని సాప్ట్‌వేర్ డెవ‌ల‌ఫ్‌గా ప‌ని చేస్తోంది. ఈ ఇద్ద‌రూ ఇన్‌స్టా గ్రామ్ ద్వారా ప‌రిచ‌యం అయ్యారు. ప్రేమ‌లో ప‌డి పెద్ద‌ల‌ను వివాహానికి ఒప్పించారు.

వివాహం త‌రువాత అనంత‌రం రిసెప్ష‌న్ వేడుక‌ను మాత్రం వీరు 3డీ టెక్నాల‌జీ సాయంతో జ‌రుపుకున్నారు. ఈ టెక్నాల‌జీ సాయంతో ఎక్క‌డో ఉన్న ఓ వ్య‌క్తి మ‌న ముందు ఉన్న‌ట్టు మాట్లాడుతున్న‌ట్టు ఊహ‌జ‌నితంగా ఉంటుంది. అందుకే వ‌రుడు దినేష్ ఈ టెక్నాల‌జీ స‌హాయంతో త‌న మ్యారేజ్ రిసెప్ష‌న్ ఎంత గ్రాండ్‌గా ఉండాల‌ని కోరుకున్నాడో అచ్చం అదే త‌ర‌హాలో నిర్వ‌హించుకున్నాడు.

రియ‌ల్ రిసెప్ష‌న్ ఎలా జ‌రుగుతుందో అచ్చ అదే మాదిరిగా వ‌ర్చువ‌ల్గా మోటావ‌ర్స్ మ్యారేజ్ రిసెప్ష‌న్ జ‌రిగింది. అతిథుల‌ను ఆహ్వానించ‌డం, పాట క‌చేరీ, విందు భోజ‌నాలు, బంధు మిత్రుల ముచ్చ‌ట్లు వ‌ధూవరుల వ‌స్త్రాలంక‌ర‌ణ అన్నీ కూడా మ‌న క‌ళ్లెదుట ఎలా జ‌రుగుతుంద‌ని ఊహిస్తామో 3డీ టెక్నాల‌జీ సాయంతో అలాగే క్రియేట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version