బంగ్లాదేశ్‌లో మళ్లీ అల్లర్లు.. పారామిలిటరీ, విద్యార్థుల మధ్య ఘర్షణ

-

రాజకీయ అస్థిరత నెలకొన్న బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస చెలరేగింది. ఆదివారం రాత్రి రాజధాని ఢాకాలో విద్యార్థులకు, పారామిలిటరీ దళమైన అన్సార్‌ సభ్యులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో కనీసం 50 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. విలేజ్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌గా పిలిచే అన్సార్‌ సభ్యులు తమ ఉద్యోగాలను ప్రభుత్వం పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్‌ చేస్తూ గత రెండు రోజులుగా ఆందోళనకు దిగారు. దీనికి తాత్కాలిక ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో ఆదివారం ఉదయం ఆందోళనను విరమించారు.

ఇది తెలుసుకున్న విద్యార్థి సంఘాలు ఢాకా యూనివర్సిటీ నుంచి సెక్రటేరియట్‌ వరకు మార్చ్‌ చేపట్టగా దీన్ని అన్సార్‌ సభ్యులు అడ్డుకున్నారు. తాత్కాలిక ప్రభుత్వంలో అడ్వైజర్‌గా ఉన్న విద్యార్థి నాయకుడు నహీద్‌ ఇస్లామ్‌ సహా పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకోవడంతో ఆదివారం రాత్రి 9.20 గంటల తర్వాత విద్యార్థులు మళ్లీ ఆందోళనకు దిగారు. ఇది కాస్తా హింసాత్మకంగా మారి విద్యార్థులు, అన్సార్‌ సభ్యుల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version