కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్ తొలి అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ రంగం సిద్ధం చేస్తోంది. తాజాగా ఇక్కడ పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా ను విడుదల చేసింది. మొత్తం మూడు విడతలకు సంబంధించి 44 మంది అభ్యర్థుల పేర్లను ఇవాళ (సోమవారం) ప్రకటించింది. తొలి విడతలో 15 మంది, రెండో విడత కోసం 10 మంది, మూడో దశకు 19 మంది అభ్యర్థులను ఈ పార్టీ బరిలోకి దింపుతోంది.
అనంత్‌నాగ్ వెస్ట్ నుంచి మహమ్మద్ రఫీక్ వనీ
పాంపోర్ నుంచి సయ్యద్ షోకాత్ గయూర్ అంద్రబీ
షోపియాన్ నుంచి జావెద్ అహ్మద్ ఖాద్రి
అనంత్‌నాగ్ నుంచి అడ్వొకేట్ సయ్యద్ వజాహత్
దోడా నుంచి గజయ్ సింగ్ రాణా తదితరులు
2019లో ఆర్టికల్ 370 రద్దవడంతో రాష్ట్ర హోదా కోల్పోయి కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గానూ.. తొలిదశలో 24 అసెంబ్లీ స్థానాలకు, రెండు, మూడు దశల్లో వరుసగా 26, 40 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. సెప్టెంబరు 18న తొలి విడత, సెప్టెంబరు 25, అక్టోబరు 1న రెండు, మూడు విడతల్లో ఓటింగ్ జరగనుంది. అక్టోబరు 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.