మతిమరుపుతో మరోసారి వార్తల్లో నిలిచిన బైడెన్

-

అగ్రరాజ్యం అమెరికాలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు ఉండగా మరోసారి ఆ దేశ అధ్యక్షుడు బైడెన్‌ తన మతిమరుపుతో వార్తల్లో నిలిచారు. ఇప్పటికే బైడెన్ మతిమరుపునకు సంబంధించిన పలు దృశ్యాలు నెట్టింట వైరల్ కావడంతో దాన్ని తన ప్రత్యర్థి, రిపబ్లిక్ పార్టీ తరఫున అధ్యక్ష పదవి బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల అస్త్రంగా వాడుకుంటున్నారు. తాజాగా బైడెన్ ప్రవర్తించిన తీరు మరోసారి ట్రంప్​నకు ఆయుధంగా మారినట్లైంది. ఇంతకీ ఏం జరిగిందంటే?

జీ-7 దేశాల సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ వెళ్లిన బైడెన్ గ్రూప్‌ ఫొటో దిగేక్రమంలో తడబడ్డారు. జీ-7 దేశాధినేతలంతా గ్రూప్‌ ఫొటో దిగేందుకు సిద్ధమైన క్రమంలో బైడెన్ మిగతా దేశాధినేతలు ఉన్న వైపు కాకుండా మరోవైపు వెళ్లారు. ఎంతసేపటికీ బైడెన్‌ రాకపోవడంతో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ వెళ్లి ఆయన్ను తీసుకొచ్చారు.  ఆ తర్వాత గ్రూప్‌-సెవెన్‌ దేశాధినేతలతో కలిసి బైడెన్‌ ఫొటోదిగారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఆయన ఆరోగ్య పరిస్థితిపై నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ఇలాంటి దృశ్యాలు రిపబ్లికన్ పార్టీకి అస్త్రాలుగా మారే అవకాశం ఉందనే చర్చ మొదలైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version