తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే (కులగణన) తుది దశకు చేరుకుంది. ఈనెల 30తో సర్వే గడువు ముగియనుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజల కుటుంబ వివరాలను ఎన్యుమరేటర్లు సేకరించారు.అనంతరం సేకరించిన ఫిజికల్ డేటాను డిజిటల్ విధానంలోనూ పొందుపరిచారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని సామాన్య ప్రజలే కాకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సైతం ఇందులో భాగస్వాములు అయ్యారు. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబీకులు సైతం సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్నారు. వారి ఫ్యామిలీ వివరాలను ఎన్యూమరేటర్లు నమోదు చేశారు. అనంతరం డేటాను డిజిటల్ చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.