రేవంత్ రెడ్డి మగాడైతే…రామోజీ ఫిలిం సిటీని కూల్చేయాలని తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య సవాల్ చేశారు. తాజాగా తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య ఓ మీడియా ఛానెల్ తో మాట్లాడుతూ… హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూల్చేస్తున్నారని ఆగ్రహించారు. స్నానం తలపై నుంచి చేస్తాం కానీ కాళ్ల పైన నీళ్ళు పోసుకొని స్నానం చెయ్యం కదా?? అంటూ చురకలు అంటించారు. పెద్దోళ్ళని వదిలేసి పేద మధ్యతరగతి వాళ్ళ మీద పడడం కరెక్ట్ కాదని మండిపడ్డారు.
ఫస్ట్ రామోజీ ఫిలిం సిటీ మీదకి వెళ్లి చూయించండంటూ తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య సవాల్ చేశారు. చంద్రబాబు కళ్ళల్లో ఆనందం చూడడానికి రేవంత్ రెడ్డి N కన్వెన్షన్ కూల్చివేశారని ఆగ్రహించారు. N కన్వెన్షన్ కూల్చి వేసావ్ సరే, మరి నీ బిడ్డ వివాహ వేడుకలు విందు వేడుకలు నువ్వు ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడే చేశావు కదా మరి అప్పుడు సోయి, సిగ్గు లేదా? అంటూ పరువు తీశారు. ఎన్టీఆర్ ఘాట్, BRK భవన్, బుద్ధ భవన్ అన్ని ఎక్కడున్నాయి? మరి వాటిని కూడా కూల్చేస్తావా అంటూ గాదె ఇన్నయ్య నిప్పులు చెరిగారు.