డ్రాగన్ కవ్వింపు.. అక్సాయ్​ చిన్​లో చైనా భారీ నిర్మాణాలు

-

డ్రాగన్ దేశం మరోసారి తన దుర్బుద్ధిని బయటపెట్టింది. సరిహద్దుల్లో చైనా కవ్వింపు చర్యలు కొనసాగిస్తూనే ఉంది. ఇటీవలే అరుణాచల్‌ప్రదేశ్‌ సహా అక్సాయ్‌ చిన్‌ ప్రాంతం తమవేనంటూ మ్యాప్‌ను విడుదల చేసిన చైనా.. ఇప్పుడు ఏకంగా.. వాస్తవాధీన రేఖకు తూర్పు ప్రాంతం అక్సాయ్‌ చిన్‌లో సొరంగాలు తవ్వుతోంది. ఉత్తర లద్దాఖ్‌లోని దెప్సాంగ్‌కు తూర్పున ఆరు కిలోమీటర్ల దూరంలో సొరంగాలు, బంకర్లు, రహదారులను నిర్మిస్తున్నట్టు వెల్లడైంది. దీనికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలు బయటికి వచ్చాయి.

అక్సాయ్‌ చిన్‌ ప్రాంతంలోని కొండల్లో కనీసం 11 చోట్ల పెద్ద కన్నాలు తవ్వుతున్నట్లు అంతర్జాతీయ నిపుణులు వెల్లడించారు. ఈ ప్రాంతంలో కొన్ని నెలలుగా పెద్దఎత్తున నిర్మాణ పనులు జరుగుతున్నట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా గుర్తించినట్లు తెలిపారు. వైమానిక, క్షిపణి దాడులు జరిగినా తమ సైన్యానికి ఎటువంటి నష్టం కలగని విధంగా పటిష్ఠమైన కాంక్రీటు నిర్మాణాలు ఉన్నట్లు సమాచారం. ఒకవేళ భారత్‌ వైమానిక దాడులకు దిగితే దీటుగా ఎదుర్కొనేందుకే చైనా అక్కడ ఈ వ్యూహాలు రచిస్తున్నట్టు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version