చైనాలో వరద బీభత్సం.. 11 మంది మృతి

-

చైనాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆ దేశ రాజధాని బీజింగ్ పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షం, పోటెత్తిన వరదలకు 11 మంది మృత్యువాత పడ్డారు. మరో 27 మంది గల్లంతయ్యారు. బీజింగ్‌కు చుట్టూ ఉండే పర్వతాల్లో వర్షం కారణంగా వరద ఉద్ధృతి ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నందున అధికారులు రైల్వే స్టేషన్లను మూసివేశారు. ఆశ్రయంలేని పేదలను పాఠశాల జిమ్‌లకు తరలించారు.

బీజింగ్‌ సహా చుట్టుపక్కల అనేక నగరాల్లో ఇళ్లు నీట మునిగాయని అధికారులు తెలిపారు. అనేక రోడ్లు కోతకు గురయ్యాయని.. కార్లు, వాహనాలు కొట్టుకుపోయాయని వెల్లడించారు. సాధారణంగా పొడి వాతవరణం ఉండే చైనా రాజధానిలో అసాధారణ వర్షపాతం నమోదు కావడం అరుదు అని.. సాధారణంగా ఇక్కడ ఒక మోస్తరు వర్షం మాత్రమే కురుస్తుందని అన్నారు. ఉత్తర చైనాలోని అనేక నగరాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని అక్కడి వార్తా సంస్థలు చెబుతున్నాయి. ఉత్తర చైనాలోని కొన్ని ప్రాంతాల్లో గత 50 ఏళ్లలో ఇదే అతి పెద్ద వరదలను పేర్కొన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news