చైనాకు కొత్త ప్రధానిగా జిన్ పింగ్ సన్నిహితుడు లీ కియాంగ్

-

చైనా కొత్త ప్రధాన మంత్రిగా జిన్‌పింగ్ సన్నిహితుడు లీ కియాంగ్ ఎన్నికయ్యారు. బీజింగ్‌లో జరుగుతున్న 14వ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ సమావేశాల్లో లీ కియాంగ్‌కు మద్దతుగా సభ్యులు ఓటు వేశారు. దాదాపు 3 వేలమంది సభ్యులు పాల్గొన్న ఓటింగ్‌లో కియాంగ్‌కు 2 వేల 936 ఓట్లు వచ్చాయి. ముగ్గురు వ్యతిరేకంగా ఓటు వేయగా.. 8 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.

గ్రేట్‌ హాల్‌ ఆఫ్‌ పీపుల్‌లో అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ సంతకంతో చైనా నూతన ప్రధానిగా లీ కియాంగ్ అధికారికంగా నియమితులయ్యారు. అనంతరం బాధ్యతలు స్వీకరించిన కియాంగ్.. దేశ రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని ప్రమాణం చేశారు.

 

జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితుడైన 63 ఏళ్ల లీ కియాంగ్‌.. కరోనా సమయంలో షాంఘై నగరంలో జీరో- కొవిడ్ విధానాన్ని అమలు చేశారు. ఆంక్షలను క్రూరంగా అమలు చేయడం.. కరోనాను కట్టడి చేయడంతో కియాంగ్ బాగా ప్రసిద్ధి చెందారు.

ఈ సమావేశాల్లోనే సెంట్రల్ మిలిటరీ కమిషన్ వైస్ ఛైర్మన్ తోపాటు మరింత మంది కొత్త నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. ఈనెల 5న ప్రారంభమైన 14వ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ సమావేశాలు 13న ముగియనున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version