గుడ్‌న్యూస్‌: నవంబర్‌ నాటికి కొవిడ్ వ్యాక్సిన్‌

-

చైనా తయారు చేస్తోన్న కోవిడ్‌ వ్యాక్సిన్‌ నవంబర్‌ నాటికల్లా ప్రజలకు అందుబాటులోకి రానుందని చైనా సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్ (సీడీసీ) వెల్లడించింది. మానవ ప్రయోగం తుది దశలో ఉన్న నాలుగు కోవిడ్‌ వ్యాక్సిన్‌లలో మూడింటిని ఇప్పటికే అత్యవసర కార్యక్రమం కింద, అత్యవసర సిబ్బందికి ఉపయోగించారు.

చైనాలో ఫేజ్‌–3 క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రక్రియ సజావుగా సాగుతోందనీ, ఈ వ్యాక్సిన్‌ నవంబర్, లేదా డిసెంబర్‌లో ప్రజలకు అందుబాటులోకి వస్తుందని సీడీసీ వెల్లడించింది. చైనా ఔషధ దిగ్గజ సంస్థ నేషనల్‌ ఫార్మాస్యూటికల్‌ గ్రూప్‌(సినోఫార్మ్‌), సినోవా బయోటెక్‌ అత్యవసర కార్యక్రమం కింద మూడు వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేస్తున్నాయి. కాన్‌సినో బయోలాజిక్స్‌ డెవలప్‌ చేసిన నాల్గో వ్యాక్సిన్‌ని చైనా సైన్యానికి ఉపయోగించేందుకు జూన్‌లో అనుమతి లభించింది. మూడవ దశ ట్రయల్స్‌ ముగిసిన తర్వాత ఈ ఏడాది చివరి నాటికి ఈ వ్యాక్సిన్‌ ప్రజలకు అందుబాటులో వస్తుందని సినోఫార్మ్‌ జూలైలో వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version