నా బిడ్డకు తండ్రి ఎలాన్ మస్క్..అంటూ రచయిత్రి సంచలనానికి తెరలేపారు. ఎలాన్ మస్క్ వివాదంలో ఇరుక్కున్నారు. “నా బిడ్డకు తండ్రి ఎలాన్ మస్క్”.. రచయిత్రి ఆశ్లీ సెయింట్ క్లెయిర్ సంచలన పోస్ట్ పెట్టింది. ఐదు నెలల క్రితం ఓ బిడ్డకు జన్మనిచ్చాను.. ఆ చిన్నారికి తండ్రి మస్క్ అని వెల్లడించింది క్లైయిర్.
మా బిడ్డ భద్రతను, గోప్యతను దృష్టిలో ఉంచుకుని ఇన్ని రోజులు ఈ విషయం బయటపెట్టలేదని ట్వీట్ చేసింది. మా ప్రైవసీకి ఎవరూ భంగం కలిగించవద్దంటూ ‘ఎక్స్’ వేదికగా షేర్ చేసింది క్లెయిర్. దీంతో… ఎలాన్ మస్క్ వివాదంలో ఇరుక్కున్నారు. మరి దీని పై ఎలాన్ మస్క్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Alea Iacta Est pic.twitter.com/gvVaFNTGqn
— Ashley St. Clair (@stclairashley) February 15, 2025