దేశీయ తయారీ కోవిషీల్డ్ వ్యాక్సిన్ కు భారీ విజయం దక్కింది. ఇన్నాళ్లు భారత్ లో తయారైన కరోనా వ్యాక్సిన్లకు గుర్తించడంలో కొన్ని దేశాలు మోకాలడ్డుతున్నాయి. దీంతో ఈవ్యాక్సిన్లు వేయించుకున్న వారిని తమ దేశాల్లోకి అనుమతించే విషయంలో అనవసర వివాదాలు స్రుష్టిస్తున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా దేశం కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ ను గుర్తించింది. దీంతో కోవిషీల్డ్ వేయించుకున్న ఆస్ట్రేలియా దేశస్తులతో పాటు ఇండియా నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లాలనుకునే విద్యార్థులు, టూరిస్ట్ లకు ఇక ఇబ్బందులు తొలిగిపోనున్నాయి.
కోవిషీల్డ్ వ్యాక్సిన్ కు భారీ విజయం… గుర్తించిన ఆస్ట్రేలియా
-