మంచూరియలో ఎలుక.. పోలీసులు వచ్చేలోపే!

-

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 10 మంది మహిళలు ముంబయిలోని పర్పుల్ బటర్ ఫ్లై అనే హోటల్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. మంచూరియాను ఆర్డర్ చేసిన ఓ మహిళ తాను తింటుండగా ప్లేట్‌లో చనిపోయిన ఎలుక దర్శనం ఇచ్చింది.


అది గమనించిన మహిళలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వెంటనే సిబ్బందిని పిలిచి వాగ్వాదానికి దిగారు. అనంతరం మహిళలు పోలీసులకు కాల్ చేసి పిలువగా.. వారు చేరుకునేలోపే సిబ్బంది ఆ ప్లేట్‌ను మాయం చేసినట్లు తెలిసింది. హోటల్స్ వాళ్లు డబ్బులు సంపాదనే చూస్తున్నారు కానీ, ప్రజల ఆరోగ్యం అంటే వారికి లెక్కలేకుండా పోయిందని నెటిజన్లు ఘోరంగా మండిపడుతున్నారు.

https://twitter.com/ChotaNewsApp/status/1898750538004771028

Read more RELATED
Recommended to you

Exit mobile version