మహీంద్రా బొలెరో వాహనాన్ని ట్రక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరోలోని ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉప్ని సమీపంలోని జాతీయ రహదారిపై సంభవించింది. తెల్లవారుజామున బల్కర్ సిద్ధి నుంచి బహ్రీకి వెళ్తున్న బొలెరో వాహనాన్ని వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టినట్లు స్థానికులు వెల్లడించారు.
ఈ ప్రమాదంలో ఏడుగురు స్పాట్ లోనే చనిపోగా, గాయపడిన వారిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం పట్ల మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్పందిస్తూ.. మృతులకు సంతాపం తెలిపింది.గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. కాగా, ఈ ఘటనకు సంబంధించి, మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.