మోదీ-పుతిన్‌ గోల్ఫ్‌ కారులో షికారు.. వీడియో వైరల్

-

రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి విశేష ఆదరణ లభిస్తోంది. అధ్యక్షుడు పుతిన్ సాదరంగా ఆహ్వానించడమే కాకుండా ప్రైవేట్ డిన్నర్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇక అంతటితో ఆగకుండా మోదీ వెంటే ఉండి, తన అధికారిక నివాసాన్ని చూపించారు. ఆ సమయంలో వారిద్దరూ గోల్ఫ్‌ కార్ట్‌లో షికారు చేశారు. ఆ ఇంటి ప్రాంగణంలో తిరుగుతూ ముచ్చచించారు. ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఇద్దరి మైత్రిపై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

రాజధాని నగరం మాస్కో సమీపంలోని నోవో ఓగర్యోవోలో పుతిన్ అధికారిక నివాసం ఉండగా.. సోమవారం రాత్రి పుతిన్‌ తన ఇంటికి మోదీని ఆహ్వానించారు. టెర్రస్‌పై కూర్చొని ఇద్దరూ తేనీరు సేవించిన తర్వాత మోదీని గోల్ఫ్‌కార్ట్‌ (గోల్ఫ్‌కారు)లో తిప్పుతూ తన ఇంటి ప్రాంగణాన్ని చూపించారు. ఆ కార్ట్‌లో మోదీని పక్కన కూర్చోబెట్టుకొని పుతిన్ డ్రైవ్‌ చేయగా.. వెనక సీటులో రెండు దేశాలకు చెందిన దౌత్యవేత్తలు కూర్చొన్నారు. ఆ క్షణాలు తనకెంతో ఆనందాన్నిచ్చాయని మోదీ సంతోషం వ్యక్తంచేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version