బరువు తగ్గాలని మస్క్‌కి ఆయన సూచన.. 9 కిలోలు తగ్గిన టెస్లా దిగ్గజం

-

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ని చూస్తేనే ఆయనకు ఫుడ్ అంటే ఎంతో ఇష్టమని అర్థం అవుతుంది. అయితే ఫుడ్ లవర్ అయిన మస్క్.. ఇప్పుడు మాత్రం తనకు ఇష్టమైన ఆహారం ఎదురుగా ఉన్నా నోరు కట్టేసుకుంటున్నారట. వ్యాయామాలంటే అసలు ఇష్టపడి మస్క్ కసరత్తులు చేసి మరీ 9 కిలోల బరువు తగ్గారట.

‘వాస్తవానికి వ్యాయామం చేయడం నాకు ఇష్టం ఉండదు. కానీ, చేయాల్సి వస్తోంది. మంచి ఆకృతి రావడానికి వర్కవుట్‌ చేస్తున్నాను. వీటితోపాటు ఓ స్నేహితుడి సలహా మేరకు అప్పుడప్పుడూ ఉపవాసం పాటిస్తున్నాను. తద్వారా ఎంతో ఆరోగ్యంగా ఉన్నా’ అంటూ ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ తన ఆరోగ్య రహస్యాన్ని వెల్లడించారు.

ఇలా చేస్తూ ఎన్ని కిలోల బరువు తగ్గారు అని మరో నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. 9కిలోలకు పైగా తగ్గినట్లు చెప్పుకొచ్చారు. ఆహారం విషయంలో ఎలాన్‌ మస్క్‌ సరైన నియమాలు పాటించరని ఆయన తండ్రి ఎరాల్‌ మస్క్‌ ఇటీవలే వెల్లడించారు. అంతేకాదు, బరువు తగ్గేందుకు ఔషధాలు వాడవచ్చు కదా! అని సూచించారు.

దీంతో నాన్న చెప్పిన మాటలను పరిగణలోకి తీసుకున్న మస్క్‌.. బరువు తగ్గేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అయితే, అందుకు ఔషధాలు కాకుండా ఉపవాసం పాటించే పద్ధతిని ఎంచుకున్నట్టు మస్క్‌ తాజాగా వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version