ఉద్యోగులతో ‘మస్క్‌’ లైంగిక సంబంధం.. వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ సంచలన కథనం

-

టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌పై మరోసారి సంచలన ఆరోపణలు వచ్చాయి. తన సంస్థ స్పేస్‌ఎక్స్‌లో పని చేసే పలువురు మహిళా ఉద్యోగినులతో ఆయన లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు ‘ది వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌’ తాజా కథనంలో ఆరోపించింది. ఇంటర్న్‌షిప్‌ కోసం వచ్చిన ఓ యువతి కూడా అందులో ఉన్నట్లు తెలిపింది. మస్క్‌ తన కంపెనీలో మహిళలకు అసౌకర్య వాతావరణాన్ని కల్పించారంటూ  గతంలో ఎలాన్‌ మస్క్‌ కంపెనీలో పనిచేసి వెళ్లిపోయిన మహిళల నుంచి వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఈ వివరాలు సేకరించినట్లు సమాచారం.

మస్క్‌కు డ్రగ్స్‌ తీసుకునే అలవాటు ఉందని, అప్పుడప్పుడు బోర్డ్‌ సభ్యులతో కలిసి వాటిని తీసుకునేవారని ఈ కథనం పేర్కొంది. తన పిల్లలకు తల్లి కావాలని ఓ ఉద్యోగినిని ఆయన కోరినట్లు తెలిపింది. తనతో గడిపితే గుర్రాన్ని బహుమతిగా ఇస్తానని 2016లో మస్క్‌ చెప్పినట్లు మరో మహిళ చెప్పినట్లు వివరించింది. స్పేస్‌ఎక్స్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ గ్విన్‌ స్పందిస్తూ మస్క్‌పై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version