వివేక్ రామస్వామికి మద్దతుగా ఎలాన్ మస్క్ మరో పోస్టు

-

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తాజాగా భారత సంతతికి చెందిన రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామికి మద్దతుగా మాట్లాడిన విషయం తెలిసిందే. ప్రముఖ వ్యాపారవేత్త అయిన  వివేక్‌ రామస్వామి.. అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్నారు. అయితే  మొదట ఎలాన్ మస్క్‌ వివేక్ కు అనుకూలంగా స్పందిస్తూ.. నమ్మకమైన అభ్యర్థి అని తన సొంత మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టారు. ఇప్పుడు తాజాగా ఆయన మరోసారి  వివేక్‌ రామస్వామికి మద్దతు పలికారు.  వివేక్‌కు అనుకూలంగా ఎందుకు స్పందిస్తున్నారో తెలిసేలా.. సోషల్ మీడియాలో మరో పోస్టు పెట్టారు.

తాజాగా ఎలాన్ మస్క్ ‘అతడు తన నమ్మకాలను స్పష్టంగా చెప్తాడు’ అంటూ  వివేక్‌ పెట్టిన ట్వీట్‌ను రీట్వీట్‌ చేశారు. ఆ పోస్టులో..‘దేవుడు నిజం.. మానవ వికాసానికి శిలాజ ఇంధనాలు అవసరం’ అంటూ వివేక్‌ తాను విశ్వసిస్తోన్న విషయాలను పేర్కొన్నారు. ఇలా కొన్ని గంటల వ్యవధిలోనే వివేక్ రామస్వామికి తన మద్దతును ప్రకటించారు మస్క్. ఇదిలా ఉంటే.. ఇటీవల వివేక్‌ తనపై విమర్శలు చేసినప్పటికీ.. ఆయనను మస్క్‌ పొగడటం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version