పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి హిందూ మహిళ పోటీ

-

పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధం అవుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నామినేషన్ స్వీకరణ ప్రక్రియ మొదలైంది. అయితే ఈసారి జరగబోయే ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని ఓ విచిత్రం చోటుచేసుకోబోతోంది. అదేంటంటే పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో తొలి సారిగా ఓ హిందూ మహిళ పోటీ చేయబోతున్నారు. ఖైబర్‌ పఖ్తుంఖ్వాలోని బునేర్‌ జిల్లాలో తొలిసారి హిందూ మహిళ బరిలోకి దిగారు.

బిలావల్‌ భుట్టో జర్దారీ నేతృత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్‌ పార్టీ-పీపీపీ తరఫున సవీరా పర్కాశ్ పీకే-25 స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. జనరల్‌ స్థానాల్లో తప్పనిసరిగా ఐదు శాతం మహిళా అభ్యర్థులు పోటీలో ఉండాలంటూ పాకిస్థాన్‌ ఎన్నికల సంఘం ఇటీవల సవరణలు తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే సవీరా పర్కాశ్‌కు సీటు లభించినట్లు సమాచారం. ఇక 35 ఏళ్లుగా పీపీపీ పార్టీలో క్రీయాశీలకంగా ఉన్న ఆమె తండ్రి ఓం పర్కాశ్‌ పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ మహిళా విభాగానికి సవీరా పర్కాశ్‌ జనరల్‌ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. ఖైబర్‌ పఖ్తుంఖ్వాలోని అబోటాబాద్‌ ఇంటర్నేషనల్‌ మెడికల్‌ కాలేజీ నుంచి ఆమె 2022లో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version