రెజ్లర్ వినేశ్ ఫొగాట్ సంచలన నిర్ణయం.. కేంద్రానికి ఖేల్రత్న, అర్జున అవార్డులు రిటర్న్

-

ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతక విజేత వినేశ్‌ ఫొగాట్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఖేల్‌ రత్న, అర్జున అవార్డులను కేంద్ర ప్రభుత్వానికి తిరిగి ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాసింది. ఒలింపిక్‌ పతక విజేత బజరంగ్‌ పూనియా, డెఫీ ఒలింపిక్స్‌ ఛాంపియన్‌ వీరేందర్‌సింగ్‌ యాదవ్‌లు తమ అవార్డులను తిరిగి ఇచ్చేసిన కొన్నిరోజుల తర్వాత వినేశ్‌ ఫొగాట్‌ కూడా వారి బాటపట్టింది.

వినేష్ ఫొగాట్ రాసిన లేఖ ఇదే..

గౌరవనీయులైన ప్రధాన మంత్రికి.. సాక్షి మాలిక్‌ రెజ్లింగ్‌ నుంచి తప్పుకుంది. బజరంగ్‌ పునియా కూడా తన పద్మశ్రీని తిరిగిచ్చేశాడు. ఇందుకు గల కారణాలు ఏంటో దేశం మొత్తానికి తెలుసు. ఈ దేశానికి నాయకుడిగా మీకు కూడా ఈ విషయాలు తెలిసే ఉంటుంది. నేను వినేశ్‌ ఫోగాట్‌. మీ దేశపు ఆడబిడ్డను. ఏడాదికాలంగా నేను పడుతున్న ఆవేదనను తెలియజేయడానికే ఈ లేఖను రాస్తున్నాను. 2016లో సాక్షి ఒలింపిక్‌ మెడల్‌ గెలిచిన రోజు నాకు ఇప్పటికీ గుర్తుంది. అప్పుడే మీ ప్రభుత్వం ఆమెను బేటీ బచావో బేటీ పడావోకు బ్రాండ్‌ అంబాసిడర్‌ను చేసింది. అప్పుడు ఈ దేశపు ఆడబిడ్డగా నేనేంతో సంతోషించాను. ఇటీవలే సాక్షి రెజ్లింగ్‌ నుంచి తప్పుకుంది. మా మహిళా అథ్లెట్లు గవర్నమెంట్ ప్రకటనలల్లో కనిపించడానికే ఉన్నామా? నాకు ఒలింపిక్ పతకం గెలవాలని లక్ష్యం ఉండేది. కానీ ఇప్పుడు అది ఓ కలగానే మిగిలిపోయింది. సాక్షి కూడా ఆట నుంచి తప్పుకుంది. మమ్మల్ని అణగదొక్కాలని చూసిన వ్యక్తి ఈ ఆటలో తాను లేకున్నా ఆటను డామినేట్‌ చేస్తానని బహిరంగంగానే చెప్తున్నారు. మీ బిజీ షెడ్యూల్లో ఓ ఐదు నిమిషాలైన వెచ్చించి ఆ వ్యక్తి (బ్రిజ్‌ భూషణ్‌ను ఉద్దేశిస్తూ) ఏం చెప్తున్నారో వినండి. అప్పుడు ఆయన ఏం చేశారో మీకు తెలుస్తుంది. మమ్మల్ని అణగదొక్కడానికి ఆయన ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. ఆయన కారణంగానే చాలా మంది మహిళా రెజ్లర్లు ఈ ఆట నుంచి వెనుకడుగువేశారు..” అని ఆ రెండు పేజీల లేఖలో వినేశ్ తన ఆవేదనను ప్రధానికి చెప్పుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version