అమెజాన్ లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. వారంలో ఇది మూడోసారి

-

అమెజాన్‌ కంపెనీలో ఉద్యోగుల కోత కొనసాగుతూనే ఉంది. ఇటీవలే వేల మందికి ఉద్వాసన పలికిన ఈ సంస్థ తాజాగా మరోసారి కోత పెట్టేందుకు రెడీ అయింది. వారం వ్యవధిలో మూడో విడత ఉద్యోగాల కోత ప్రకటించింది అమెజాన్ కంపెనీ. అయితే ఈసారి ఈ సంస్థ యాజమాన్యంలోని ఆడియో బుక్‌, పాడ్‌ కాస్ట్‌ సంస్థ ఆడిబుల్ అయిదు శాతానికి పైగా ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించినట్లు సమాచారం.

కంపెనీ అనేక సవాళ్లు ఎదుర్కొంటోందని ఆడిబుల్‌ సీఈఓ బాబ్‌ కారిగన్‌ వెల్లడించారు. తమ యూజర్లకు మెరుగైన సేవలు అందించాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదని చెప్పుకొచ్చారు. “సిబ్బందిని తొలగించడం ఇష్టం లేదు. కానీ కంపెనీ సామర్థ్యాన్ని మెరుగుపర్చడం కోసం తప్పడం లేదు. అప్పుడే యూజర్లకు నిరంతరాయ సేవలను అందించగలం.” అని ఉద్యోగులకు రాసిన లేఖలో బాబ్‌ తెలిపారు. తొలగింపుల సంఖ్యను మాత్రం కచ్చితంగా వెల్లడించలేదు. ఇప్పటికే ఇదే వారంలో ప్రైమ్‌ వీడియో, ఎంజీఎం స్టూడియో, ట్విచ్‌లోనూఅమెజాన్‌ ఉద్యోగులకు ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version