బెంగళూరు లేడీ సీఈవో కేసు.. కుమారుడి మృతదేహం పక్కన లేఖ

-

నాలుగేళ్ల కుమారుడిని హత్య చేసిన కేసులో అరెస్టైన బెంగళూరు సీఈవో సుచనా సేఠ్‌ కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ వ్యవహారంలో నిందితురాలు సుచనా సేఠ్ మానసిక పరిస్థితిపై అనుమానంగా ఉందంటూ పోలీసులు తెలిపారు. ఆమె లేఖ రాసి కుమారుడి మృతదేహం పక్కన పెట్టినట్లు గుర్తించినట్లు చెప్పారు. న్యాయస్థానంలో విడాకులు, బాలుడి కస్టడీపై విచారణతో ఆమె తీవ్ర ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోందని అన్నారు.

సుచనా తన కుమారుడి కస్టడీ అంశాన్ని టిష్యూ పేపర్‌పై ఐలైనర్‌ వాడి లేఖ రాసిందని పోలీసులు తెలిపారు. ‘‘ఏం జరిగినా సరే కుమారుడు నా వద్దే ఉండాలి. కోర్టు విడాకులు మంజూరు చేసినా సరే.. కస్టడీ హక్కు నాకే దక్కాలి’’ అని అందులో పేర్కొన్నట్లు చెప్పారు. హత్య అనంతరం బాలుడి మృతదేహాన్ని ఉంచిన బ్యాగ్‌లో ఆ లేఖ పెట్టినట్లు గుర్తించామని వెల్లడించారు.

మరోవైపు కేసు విచారణకు సుచనా ఏమాత్రం సహకరించడంలేదని పోలీసులు అన్నారు హత్య విషయంలో ఆమెకు ఏమాత్రం పశ్చాత్తాపం లేదని వెల్లడించారు. ప్రస్తుతం ఆమెకు మానసిక, శారీరక వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version