మాపై దాడి జరిగితే.. ఇజ్రాయెల్ కి ఇరాన్ కీలక హెచ్చరిక..!

-

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. కేవలం పశ్చిమాసియానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఈ విషయం పై చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ కి ఇరాన్ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఇక పై ఇస్లామిక్ రిపబ్లిక్ పై ఎలాంటి దాడులు జరుగకూడదని.. అలా జరిగితే ఇజ్రాయెల్ పై ప్రతీకార దాడులకు పాల్పడుతామని పేర్కొంది. ఇరాన్ మౌళిక సదుపాయాలకు ఎలాంటి దాడి జరిగినా ఇజ్రాయెల్ పై ప్రతీకార దాడులు తప్పవని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరక్చీ హెచ్చరించారు.

ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్ బొల్లా అధినేత నస్రల్లా మరణించిన అనంతరం ఇరాన్ 200 బాలిస్టిక్ మిస్సైళ్లతో ఇజ్రాయెల్ పై విరుచుకుపడింది. దీంతో ఇరాన్ పెద్ద తప్పు చేసిందని.. మూల్యం చెల్లించుకుంటుందని ప్రతీకార దాడి తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్న విషయం విధితమే. ఇరాన్ అణుస్థావరాలపైనే ఇజ్రాయెల్ దాడి చేయవచ్చని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుమానం వ్యక్తం చేశారు. ఇరాన్ ఉనికి ప్రమాదంలో పడితే మాత్రం తమ దేశం అవసరమైతే అణ్వాయుధాలు కూడా ప్రయోగించడానికి కూడా వెనుకాడదని పేర్కొన్నారు ఇరాన్ సుప్రీంలీడర్, సలహాదారు కమాల్ ఖర్రాజీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version