విశాఖపట్నం తీరంలో ఇసుక నల్లగా కనపడుతోంది. చాలామంది కాలుష్యమే ఇందుకు కారణం అని అనుకుంటారు. అయితే నిపుణులు మాత్రం కారణం ఇది కాదని చెప్తున్నారు. విశాఖపట్నం బీచ్ లో కొన్ని రోజులుగా చాలా చోట్ల ఇసుక నల్లగా కనపడుతోంది. బయట నుంచి వచ్చే చెత్తాచెదారం, కాలుష్యం ఇలా పలు కారణాల వలన ఇసుక నల్లగా మారిపోయింది అని చాలామంది భావిస్తున్నారు. చెత్త చెత్తరం ఎక్కువై క్లీనింగ్ వంటివి జరగకపోవడం వలన ఇలా మారిపోయిందని చాలామంది స్థానికులు అనుకుంటున్నారు. కానీ నిజమైతే అది కాదుట.
అసలు ఈ నల్లని ఇసుక విశాఖ పరిసర ప్రాంతాల్లో ఎందుకు ఏర్పడుతోంది..? కారణం ఏంటి అనేది చూస్తే.. తూర్పు కనుమల్లో వివిధ రకాల రాయిలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆల్టరేషన్ అయ్యి అందులో నుంచి ఇసుక అంత పార్టికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి. నదుల ద్వారా సముద్రానికి చేరతాయి. అలాగే ఇంకొక కారణం ఏంటంటే వేవ్ వ్యాక్సిన్ వలన ఇవి సముద్రంలోకి చేరుతాయి.
దీంతో ఇసుక నల్లగా మారిపోతుంది. ఒక్కోసారి సముద్రం బాగా డిస్ట్రబ్ అయినప్పుడు సపరేషన్ ఎక్కువ అవుతుంది. ఎక్కువ నల్లటి పార్టికల్స్ అనేవి చేరుతాయి. శ్రీకాకుళం నుంచి విశాఖ వరకు ఈ నల్లటి ఇసుక ఎక్కువగా కనపడుతోంది. అయితే దానికి కారణం పొల్యూషన్ లేదంటే దుమ్ము, ధూళి వంటివి కాదు. ఇలా ఖనిజాలు లో ఉండేవి ఇసుకలోకి చేరడం వల్లనే ఈ నల్ల ఇసుక కనపడుతోందని నిపుణులు చెప్తున్నారు. నల్లటి ఇసుక విశాఖ బీచ్ లో కూడా కనపడడానికి కారణం అయితే ఇదే.